“కొండా” దంపతులపై రామ్ గోపాల్ వర్మ సినిమా : పోస్టర్ విడుదల

-

చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ను అభిమానించే వారు ఎంతమంది ఉన్నారో.. ఈయనను తిట్టుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. వర్మ చేసే వ్యాఖ్యలు.. సినిమాలు అన్ని వివాదాస్పదంగా ఉంటాయి. ఇక ఈ మధ్యలో కొంతమంది గర్ల్స్ తో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఆర్జివి. ఇక బయోపిక్ లకు పెట్టింది పేరు రామ్ గోపాల్ వర్మ.

ఇప్పటికే చాలా యధార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకుని బయోపిక్ లు తీసిన రామ్ గోపాల్ వర్మ.. రాజకీయ నాయకుడు కొండా మురళి జీవిత చరిత్ర పై బయోపిక్ తీయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఇవాళ ఈ బయోపిక్ పై కీలక ప్రకటన చేశారు రాంగోపాల్ వర్మ.

“ఇప్పటివరకు తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకుల పై సినిమాలు తీశాను.. కానీ తెలంగాణకు చెందిన ఏ ఒక్క రాజకీయ నాయకుడి జీవిత చరిత్రను తెరకెక్కించ లేడు. అయితే ఈసారి వరంగల్ కు చెందిన కొండా మురళి జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నాను. ఒకప్పటి నక్సలైట్ రామకృష్ణ మరియు కొండ మురళి మధ్య జరిగిన సన్నివేశాల ఆధారంగా ఈ సినిమా తీస్తాను. అప్పటి రాచరిక వ్యవస్థను ప్రజలకు ప్రతిబింబించేలా చేస్తాను. ఈ సినిమా షూటింగ్ ను వరంగల్ పరిసర ప్రాంతాల్లోనే చేస్తాం” అంటూ రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ఈ వీడియోను కూడా విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news