Breaking : తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఎంతంటే..?

-

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. అయితే.. గత కొన్ని రోజులుగా మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వచ్చి లీటరుకు రూ.120 దాటాయి. కేంద్ర నిర్ణయంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు నిన్నటితో పోలిస్తే నేడు స్థిరంగా ఉన్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర లీటరుకు రూ.97.82 గా ఉంది.

ఇక వరంగల్‌లో ధరలు నేడు పెరిగాయి. నేడు పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.109.35 గా ఉంది. డీజిల్ ధర రూ.0.17 పైసలు రూ.97.52 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.69 పైసలు తగ్గి.. రూ.111.11 గా ఉంది. డీజిల్ ధర రూ.0.65 పైసలు తగ్గి రూ.99.16 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు తగ్గాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.53 పైసలు తగ్గి రూ.112.03 గా ఉంది. డీజిల్ ధర రూ.0.51 పైసలు తగ్గి రూ.99.74 గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. ముందు రోజుతో పోలిస్తే లీటరు ధర రూ.0.50 పైసలు తగ్గి రూ.110.48 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.47 పైసలు తగ్గి రూ.98.27గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version