న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు వీర బాదుడు కొనసాగుతోంది. ఇప్పటివరకూ వరుసగా 36 సార్లు ఆయిల్ ధరలు పెరిగాయి. దేశంలో ఇవాళ పెట్రోల్ ధర లీటర్ 36 పైసలు, డీజిల్ లీటర్‌పై 15 పైసలు వరకూ పెరిగింది. అత్యధికంగా జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 107.01 గా ఉంది. లీటర్ డీజిల్ రూ. 98.41గా నడుస్తోంది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 100.56 కాగా పెట్రోల్ రూ. 89,62గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104,50గా ఉంది. ఇక లీటర్ డీజిల్ రూ. 97,68గా పెట్రోల్ బంకుల్లో విక్రయాలు జరుగుతున్నాయి.
కాగా అంతర్జాతీయంగా చమురుకు పెరిగిన డిమాండ్ వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ఇక ప్రతి రోజు ధరలు సవరించబడతాయని పేర్కొన్నారు. అయిల్ ఆయిల్ రేట్స్ పెరగడాన్ని వాహనదారులు తప్పుబడుతున్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెరుగుదలతో నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం చేపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..