న్యూఢిల్లీ: ఈ రోజు ఆయిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 15 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.54గా ఉండగా లీటర్ డీజల్ ధర రూ. 89,87గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 105.52 కాగా డీజిల్ రూ. 97,96గా విక్రయిస్తున్నారు. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107,70 కాగా విశాఖపట్నంలో రూ.106,95గా ఉంది.
దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. రెండు నెలల్లో 36 సార్లు ఆయిల్ ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఈ భారం నిత్యావసరాలపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు. ఇక సీసీఎం, సీపీఐ పార్టీలు అయితే పెరిగిన ఆయిల్ ధరలు తగ్గించాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అయినా కేంద్రప్రభుత్వం మాత్రం దిగిరావడంలేదు.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి…