వాహనదారులకు దిమ్మతిరిగే షాక్‌..మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

-

ఇండియాలో చమురు ధరలు మండిపోతున్నాయి. వరుసగా ఏడు రోజుల్లో ఆరో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెరుగుతున్న పెట్రోల్‌ ఛార్జీలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇక తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను ఇవాళ మరోసారి పెంచేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 30 పైసలు పెరగగా…డీజిల్ ధర 35 పైసలు పెరిగింది.

దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.99.41 కు ఎగసింది. అలాగే.. డీజిల్‌ రేటు లీటరుకు రూ. 90.77 కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 114.19 కు పెరిగింది. అలాగే.. డీజిల్‌ రేటు లీటరుకు రూ. 98.50 కు పెరిగింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎంత మేర పెరిగాయో చూసేద్దాం. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.112.37 కు ఎగసింది. అలాగే.. డీజిల్‌ రేటు లీటరుకు రూ. 99.34 కు పెరిగింది. ఏపీ ముఖ్య నగరమైన విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.114.51 కాగా..లీటర్‌ డీజిల్‌ ధర రూ.100.46 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news