తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది టీఎస్పీఎస్సీ. వన్ టైం రిజిస్ట్రేషన్ లో మార్పులకు అవకాశం కల్పించాలని టిఎస్పిఎస్సి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు TSPSC వెబ్ సైట్ ను సంప్రదించి.. వన్ టైం రిజిస్ట్రేషన్ లో ఎడిట్ ఆప్షన్ ను ఎంచుకొని… కొత్త స్థానికత, విద్యార్హతలను మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.
ఇందుకు కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం… రాష్ట్రంలో జిల్లాలు, జోన్ లు, మల్టీ జోన్ల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో స్థానిక అర్హతలను సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.
ఇది వరకు నాలుగు నుంచి పదో తరగతి వరకు నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే ఆ జిల్లాలో స్థానికుడుగా పరిగణించేవారు. ఇప్పుడు ఒకటి నుంచి ఏడు తరగతులు లో చివరి నాలుగు సంవత్సరాలు ఏ జిల్లా, జోన్, మల్టీ జోన్ లో చదివితే ఆ జిల్లా, జోను, మల్టీ జోన్ లో స్థానికుడుగా పరిగణిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ లెక్కన టీఎస్పీఎస్సీ ఓటిఆర్ లో మార్పులు చేశారు. అలాగే కొత్త అభ్యర్థులు కూడా రిజస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.