ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వివిధ రకాల సేవలని ఆన్ లైన్ లో ఇస్తోంది. ఇంట్లో వుండే వివిధ రకాల సేవలని మనం పొందొచ్చు. పీఎఫ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకునే వారు ఈ-నామినేషన్ నమోదు చెయ్యడం తప్పనిసరి.
ఈ-నామినేషన్ అవ్వక పోతే డబ్బులు విత్‌డ్రా చెయ్యడం కుదరదు. చాలా మంది ఈ నామినేషన్ ఫైలింగ్ చేస్తున్నా కూడా పూర్తి కావడం లేదు. ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ ని కనుక అప్‌డేట్ చేయకపోతే ఈ-నామినేషన్ పూర్తి చెయ్యడానికి అవ్వదు. ఇక ఎలా ఫోటో ని అప్డేట్ చేసుకోవాలి..? అనేది చూద్దాం.
దీని కోసం ముందు మీరు మీ యూఏఎన్ నెంబర్ ఐడీ తో ఈపీఎఫ్ లో పోర్టల్ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి.
ఆ తరవాత మెనూ సెక్షన్ కి వెళ్లి క్లిక్ చేసి ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
ప్రొఫైల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి అక్కడ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి.
ఇప్పుడు ఎడమ వైపు లో ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చెయ్యండి. అక్కడ క్లిక్ చేసేస్తే ఫోటోను మార్చడం కి అవుతుంది.
ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసి ఈపీఎఫ్‌ఓ లో ఫోటో అప్‌లోడ్ చేయాలి
రెండు చెవులు కనిపించేలా ఫోటో విజువల్ ఉండేలా చూసుకోండి.
మీ ఫోటో JPEG, JPG, PNG ఫార్మాట్ లో సేవ్ చేయాలి గుర్తు పెట్టుకోండి.
తర్వాత అప్ లోడ్ యువర్ ఫోటో క్లిక్ చేసి ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసేస్తే… మీ ఫోటో అప్‌లోడ్ అవుతుంది.