పీజీ డెంటల్‌ కోర్సు చేయాలనికునే వారి గుడ్‌ న్యూస్‌.. కటాఫ్‌ మార్కులు తగ్గింపు

-

పీజీ డెంటల్ కోర్సు చేయాలనుకునే విద్యార్థులకు కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం శుభవార్త చెప్పింది. పీజీ డెంటల్ ప్రవేశాలకు నీట్ కటాఫ్ మార్కులను తగ్గించడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం తెలిపింది . ఈ మేరకు విశ్వవిద్యాలయం ఎండీఎస్ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి మరో ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్‌ 2022 పీజీ అర్హత కటాఫ్‌ స్కోరును 25.714 పర్సెంటైల్‌ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు 24.286 పర్సెంటైల్‌(174 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కి 14.286 శాతం (138 మార్కులు), దివ్యాంగులకు 19.286 శాతం పర్సెంటైల్‌(157 మార్కులు) సాధించిన అభ్యర్థులు అర్హత సాధించారు. కటాఫ్‌ మార్కులు తగ్గించడంతో అర్హత పొందిన అభ్యర్థులు ఈ నెల‌ 18 వ తేదీ ఉదయం 8 గంటల నుండి 20వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version