ఫ్యాక్ట్ చెక్: 3జీ, 4జీ మొబైల్స్ ఇండియాలో నిలిచిపోనున్నాయా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.

వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

దేశంలోని కొన్ని నగరాల్లో 5జీ నెట్‌వర్క్ ని ఈమధ్య లాంచ్ చేసారు. అయితే దీని గురించి సోషల్ మీడియా లో ఓ వార్త వైరల్ గా మారింది. 3జీ, 4జీ స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం కంపెనీలకు సూచనలు జారీ చేసిందని ఇందులో వుంది. అయితే మరి నిజంగా 3జీ, 4జీ స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం కంపెనీలకు సూచనలు జారీ చేసిందా..? నిజం ఎంత అనేది చూస్తే..

3జీ, 4జీ స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం కంపెనీలకు సూచనలు జారీ చేయలేదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. దీనిలో నిజమేమి లేదు. కనుక జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news