400 బిలియన్ డాలర్ల ఎగుమతులను సృష్టించాం : ప్రధాని మోడీ ప్రకటన

-

ప్రతి నెల చివరి ఆదివారం.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాన్‌ కీ బాత్‌ లో ప్రశంగిస్తారన్న విషయం తెలిసిందే. అయితే.. ఇందులో భాగంగానే మార్చి చివరి ఆదివారం అయిన ఇవాళ..ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. ఇండియా నుంచి విదేశాలకు ఎగుమతులు పెరిగాయన్న విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు ప్రధాని మోడీ.

ఇటీవల ఇండియన్స్‌ గర్వించే విధంగా ఒక ఘనతను సాధించామని ఆయన వివరించారు. ఇండియా ఏకంగా 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని ప్రధాని మోడీ ప్రకటన చేశారు. గతంలో ఎగుమతుల విలువ 100 బిలియన్‌ డాలర్లు, కొన్ని సార్లు 150 బిలియన్‌ డాలర్లు, కొన్ని సార్లు 200 బిలియన్‌ డాలర్లు ఉండేవని ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడు మాత్రం ఏకంగా 400 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఇండియాలో తయారయ్యే వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని దీని ద్వారా తెలుస్తోందని చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news