Breaking : కాంగ్రెస్‌ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోడీ

-

గుజరాత్‌ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. అయితే.. భావ్‌నగర్‌లోని పాలీతానా సిటీలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలను ప్రచారం చేస్తోందని అన్నారు. కుల రాజకీయాల కారణంగానే ఆ పార్టీని ప్రజలు అధికారం నుంచి దించేశారని, రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ సాగించాలనుకుంటే కుల రాజకీయాలను దూరంగా పెట్టి, పనితీరును మార్చుకోవాలని సూచించారు మోడీ. కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌ ప్రజలు తాము సురక్షితంగా లేమనే అభిప్రాయంతో ఉండేవారని, బాంబు పేలుళ్లు సర్వసాధారణంగా ఉండేవని చెప్పారు మోడీ. రోజు విడిచి రోజు బాంబు పేలుళ్ల ఘటనలో రాష్ట్రంలో చోటుచేసుకునేవని అన్నారు మోడీ. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూతపడిన దుకాణాల షట్టర్లు తెరుచుకున్నాయని, ఇప్పుడు గుజరాత్ ప్రజలంతా భద్రతాభావంతో ఉన్నారని, ఇది బీజేపీ ఇచ్చిన బహుమతి అని అన్నారు మోడీ.

పోలింగ్ రోజున ప్రజలు ప్రతి బూత్‌కూ పెద్దఎత్తున వెళ్లి ఓటింగ్ చేయాలని ప్రధాని కోరారు. ”రాష్ట్రంలో కమలం వికసించేలా చూడాలి. అందుకోసం మీరంతా కష్టపడి పనిచేసి ప్రతి సీటులోను బీజేపీకి ఘనవిజయం చేకూర్చాలి. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలోనే గుజరాత్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా మేము తీర్చిదిద్దుతాం. ఇందుకు మీ సపోర్ట్ అవసరం” అని అన్నారు మోడీ. ఒకానొక సమయంలో ప్రజలు ఉపాధి కోసం గుజరాత్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఉద్యోగాల కోసం గుజరాత్‌కు వస్తున్నారని, రాష్ట్రంలో శ్రీఘ్ర పారిశ్రామికాభివృద్ధే ఇందుకు కారణమని చెప్పారు మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version