బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశించిన ప్రధాని మోదీ

-

బీజేపీ పార్లిమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ లైబ్రరీ లో జరిగింది. ఈ యొక్క సామావేశంలో పలువురు బీజేపీ ఎంపీలు పాలుపొందండం జరిగింది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పార్లమెంట్ లోపాటించాల్సిన వ్యూహాలు, కేంద్ర పధకాలు మరియు బడ్జెట్ యొక్క ప్రయోజనాలను ప్రజల్లోకి ఎలా తీసుకెల్లాలో పార్టీ కి సంబందించిన ఎంపీలకు దిశానిర్ధేశం చేసారు.

 

ప్రతిపక్షాలు చేస్తున్న సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో మోదీ ఎంపీలకు సూచించారు. దేశములో జరుగుతున్న అరాచకాలను ఎలా అడ్డుకోవాలో సూచించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ ఎంపీలు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. కాగా ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 2 విడతలలో 66 రోజుల పాటూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31న ప్రారంభమైన సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ సమావేశాల్లో పలు బిల్లులకు చట్ట రూపం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news