ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇండియాలో ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అయిందని నిపుణులు, ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఇందులో భాగంగానే.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా థర్డ్ వేవ్ పై వైద్య నిపుణులు, కేంద్ర మంత్రులతో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు.
కరోనాను ఎలా కట్టడి చేయాలి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం, లాక్ డౌన్ ప్రకటిస్తే జరిగే పరిణామాలు ఇలా అనేక అంశాలపై ఇవాళ ప్రధాని మోడీ చర్చించనున్నారు. ఇక ప్రధాని మోడీ సమావేశం అనగానే.. లాక్ డౌన్ ప్రకటిస్తారేమోనని అందరూ భయపడిపోతున్నారు. కాగా…గడిచిన 24 గంటల్లో దేశంలో 1,59,632 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 5,90,611 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది.రోజు వారి కరోనా పాజిటివిటీ రేటు ఏకంగా 10.21 కు చేరింది.