ఏపీ, తెలంగాణ విభజన హామీలపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తాము చిత్తశుద్ధితో పని చేశామని ప్రధాని మోదీ అన్నారు. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారంతో ఏపీ విభజన చట్టంలోని నిబంధనలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏకాభిప్రాయ సాధన ద్వారా ద్వైపాక్షిక సమస్యలను సామరస్యంగా పరిష్కరించడానికి కేంద్రం నిరంతరం ప్రయత్నిస్తోందని చెప్పారు.  2014 నుంచి ఇప్పటివరకూ 33 సమీక్షా సమావేశాలను నిర్వహించామని వెల్లడించారు.

రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కొరవడటంవల్ల 89 సంస్థలు/కార్పొరేషన్ల విభజన పూర్తి కాలేదని మోదీ తెలిపారు.  ఇందులో కొన్ని సంస్థల విభజనపై రెండు రాష్ట్రాలూ కోర్టుల్లో కేసులు వేయడంతో  విభజన చట్టంలోని నిబంధనల అమల్లో జాప్యానికి దారి తీసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ద్వైపాక్షిక సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందన్నది తమ ప్రభుత్వ విధానమన్న మోదీ.. సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కేవలం సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరించగలదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news