ప్రధాని మోదీ మరో రికార్డ్… యూట్యూబ్ సబ్​స్క్రైబర్లలో నెం.1

-

ప్రధాని మోదీనికి ఉన్న ప్రజాధరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకు నరేంద్ర మోదీ ప్రజాధరణ పెరుగుతోంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మోదీకి ఫాలోయింగ్ ఉంది. గతంలో ఎక్కువ ప్రజాధరణ ఉన్న నాయకుల స్థానంలో కూడా టాప్ లో నిలచారు మోదీ. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ మరోసారి రికార్డ్ క్రియేట్ చేశారు.

ప్రపంచం నాయకుల యూట్యూబ్ ఛానెళ్లను పరిశీలిస్తే ఎక్కవ మంది సబ్​స్క్రైబర్లు ఉన్న ఛానెల్ గా ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ నెం. 1 గా ఉంది. ఫిబ్రవరి 1 నాటికి మోదీ యూట్యూబ్ ఛానెల్ సబ్​స్క్రైబర్ల సంఖ్య కోటిని దాటింది. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు 164.31 కోట్ల వ్యూస్ సాధించింది. 2019లో కాశీలో దివ్యాంగులు ఆయనను స్వాగతించడం, 2019లో అప్పటి ఇస్రో చీఫ్ కె శివన్‌తో చేసిన చిన్న ఎమోషనల్ క్లిప్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో గంటసేపు ఇంటర్వ్యూ చేయడం వంటి వీడియోలు ఎక్కువ వ్యూస్ సాధించాయి.

ఇతర ప్రపంచ నాయకుల యూట్యూబ్ ఛానెళ్ల సబ్ స్క్రైబర్లను పరిశీలిస్తే బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో మొత్తం 36 లక్షల మంది సబ్‌స్క్రైబర్లతో గ్లోబల్ లీడర్‌ల లిస్ట్‌లో రెండవ స్థానంలో ఉండగా, మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 30.7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లతో మూడవ స్థానంలో …  అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు 7.03 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

దేశంలో ప్రముఖ నాయకుల యూట్యూబ్ ఛానెల్ సబ్​స్క్రైబర్లు సంఖ్యను పరిశీలిస్తే  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా, ఆయన పార్టీ సభ్యుడు శశి థరూర్‌కు 4.39 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షల మంది, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు 2.12 లక్షల మంది, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు 1.37 లక్షల మంది యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news