భారీ వ‌ర్షాల ఎఫెక్ట్…ప్ర‌ముఖ‌ ర‌చ‌యిత్రి మృతి..!

-

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. చెన్నైలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కార‌ణంగా చలిజ్వరం బారినపడిన ప్రముఖ రచయిత్రి వాణిమోహన్ కన్నుమూసారు. వాణీమోహన్ కు 85 సంవత్సరాల వయస్సు ఉంటుంది. చలి జ్వరం కారణంగా ఆమె రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వాణీ మోహన్ కుమారుడు అమెరికా నుండి ఈరోజు చెన్నై చేరుకుంటారని… రేపు అంత్యక్రియలు జరుపుతామని కుటుంబ స‌భ్యులు వెల్లడించారు. వాణి మోహన్ భ‌ర్త రైల్వేలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహించేవారు.

దాంతో వారి కుటుంబం ఎక్క‌వ కాలం పాటూ ఉత్త‌ర భార‌తంలో స్థిర‌పడింది. ఇక చెన్నైలో స్థిరపడిన తర్వాత ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ స్ఫూర్తితో వాణిమోహన్ రచయిత్రిగా రానించారు. ఎన్నో కవితలు కథలు రాసి దేశ విదేశాల్లో రచయితలతో కలిసి గుర్తింపు తెచ్చుకున్నారు. గొలుసు అనే న‌వ‌ల‌తో పాటు చిగురులు అనే న‌వ‌ల‌తో వాణీమోహ‌న్ ఎంతో పాపుల‌ర్ అయ్యారు. ఆకాశవాణి కేంద్రంలో కొన్ని సంవత్సరాల పాటు వివిధ అంశాలపై వాణిమోహన్ ప్రసంగాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version