నారా లోకేశ్‍పై కేసు నమోదు

-

విజయవాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేశ్‌పై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ సందర్భంగా పరామర్శకోసం సూర్యారావుపేట కోర్టు సెంటర్‍కు నారా లోకేశ్ వెళ్లారు. ఈ సమయంలో నారా లోకేశ్ కరోనా నిబంధనలు పట్టించుకోలేదని ఆయనపై పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ నారా లోకేశ్, కొల్లు రవీంద్ర తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

లోకేశ్‌పై కేసు నమోదు చేయడాన్ని తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పుబడుతున్నారు. లోకేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై కక్ష కట్టారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు కేసులు పెడుతున్నారని అంటున్నారు. లోకేశ్ పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీనేతలు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news