యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్‌ ప్రశాంత్ పై వేటు

-

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల ట్రోలింగ్ వ్యవహారంలో ట్విస్ట్! సొంత పార్టీ వారే ట్రోలింగ్ చేసినట్లుగా వెలుగు చూసిందని మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు తదితర సీనియర్ నేతలపై జోరుగా ట్రోలింగ్ నడుస్తోంది. మే 5వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. తనపై ఓ నెంబర్ నుండి పదేపదే ట్రోలింగ్ జరుగుతోందని అందులో ఉత్తమ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ప్రశాంత్ టీమ్ పై 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మే 17వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సదరు ఫ్లాట్ యూత్ కాంగ్రెస్ పేరుతో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడి నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ ఛార్జ్ ప్రశాంత్ పై వేటు వేసింది. అటు ప్రశాంత్ ని విచారణకు హాజరు కావాల్సిందిగా సైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version