కరోనా ఎఫెక్ట్: మూతపడ్డ పోలీస్ స్టేషన్..!

-

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కోవిడ్‌ కారణంగా పలు ప్రాంతాల్లో మళ్ళీ లాక్‌ డౌన్ కూడా అమలు పరుస్తోంది ఏపీ ప్రభుత్వం. అందులోనూ పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులపై కూడా ఈ వైరస్ ప్రభావం చూసిస్తోంది. తాజగా నెల్లూరులోని వెంకటగిరి పోలీస్ స్టేషన్‌ లో కరోనా కలకలం సృష్టించింది.

దాదాపు 11 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వెంకటగిరి సీఐతో పాటు ఎస్సై, మరో ఏడు మంది కానిస్టేబుళ్లకి, హోంగార్డులకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ దెబ్బతో పోలీసు స్టేషన్ మూతబడింది.  వీరందరికి పోలీస్ స్టేషన్‌లో పని చేసే మహిళా స్వీపర్లు, మర్డర్ కేసులో ఉన్న నిందితుల ద్వారా కరోనా సోకినట్లు సమాచారం. పోలీసుల కుటుంబ సభ్యులకు సైతం వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news