పంజాబ్ ఎలెక్షన్స్: కాల్/ వాట్సాప్ చేయండి.. సీఎం అభ్యర్థిని నిర్ణయించండి!

-

ఆమ్ అద్మీ పార్టీ(ఆప్) వినూత్న సంప్రదాయానికి తెర తీసింది. పంజాబ్‌లో ఆప్ సీఎం అభ్యర్థి నిర్ణయాధికారం ప్రజలకే వదిలి వేసింది. రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే ఫోన్ కాల్/ మెసేజ్/ వాట్సాప్ చేసి ఆప్ సీఎం అభ్యర్థిని నిర్ణయించవచ్చు అని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఇలాంటి వినూత్న ప్రయోగాన్ని చేపట్టలేదు.

పంజాబ్ రాష్ట్రంలో అధికారంపై ఆశలు పెట్టుకున్న ఆప్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. వచ్చే వారం తమ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే, ఆ నిర్ణయాధికారం ప్రజలకే వదిలి వేశారు. 70748 70748 అనే ఫోన్ నెంబర్‌కు రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే ఫోన్ కాల్/ మెసేజ్/ వాట్సాప్ చేసి ఆప్ సీఎం అభ్యర్థిని నిర్ణయించవచ్చు అని తెలిపారు.

ఆప్ సీఎం అభ్యర్థి ఎంపికను మూడు కోట్ల పంజాబ్ ప్రజల ఇష్టానికే వదిలివేస్తున్నాం. జనవరి 17 సాయంత్రం 5గంటల లోపు ప్రజలు తమ నిర్ణయాన్ని తెలియజేస్తారు అని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news