చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లకు అండర్స్టాండింగ్ బాగా కుదిరినట్లు ఉంది. అందుకే టిడిపి-జనసేన నేతలు ఒకరినొకరు విమర్శించుకోకుండా చక్కగా ముందుకెళుతున్నారు. చెప్పాలంటే రెండు పార్టీలు ప్రతిపక్షంలోనే ఉన్నాయి. అలా అని పొత్తులో లేవు. కానీ ఈ రెండు పార్టీల టార్గెట్ ఒక్కటే అది వైసీపీ. వైసీపీని ఎలా అధికారంలో నుంచి దించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.
కాకపోతే ఇంతకాలం సెపరేట్‌గా రాజకీయం చేస్తూ చంద్రబాబు-పవన్‌లు ముందుకెళుతున్నారు. ఇందులో బాబు…మొదట నుంచి జగన్‌ని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఓ రేంజ్లో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే ఇక్కడ పవన్…చంద్రబాబుని ఒక్క మాట కూడా అనడం లేదు.
ఎంతసేపు జగన్నే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ ఒక లాజిక్ మరిచిపోతున్నారు. పవన్ అధికారంలోకి రావాలంటే జగన్‌ని టార్గెట్ చేస్తే సరిపోదు…చంద్రబాబుని కూడా టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఏపీలో జగన్ తర్వాత ఎక్కువ బలం ఉన్నది చంద్రబాబుకే. అలాంటప్పుడు ఆయన్ని కూడా దెబ్బకొడితేనే పవన్ సిఎం అవ్వగలరు. కానీ ఇక్కడ పవన్…కేవలం జగన్‌ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటే…దాని అర్ధం చంద్రబాబుతో కలిసి పయనించనున్నారని తెలుస్తోంది.
అటు చంద్రబాబు గానీ, టిడిపి నేతలు గానీ పవన్‌కు మద్ధతుగా మాట్లాడుతున్నారు. వైసీపీ మంత్రులు, పోసాని కృష్ణమురళిపై ఫైర్ అవుతున్నారు. అంటే పవన్-చంద్రబాబుల అండర్స్టాండింగ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమైపోతుంది. మరి ఈ ఇద్దరు కలిస్తే మధ్యే బిజేపి పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్…బిజేపితో కలిసే పయనిస్తున్నారు. భవిష్యత్‌లో బిజేపిని అంటిపెట్టుకునే బాబుతో ముందుకెళ్తారా అనే విషయంపై క్లారిటీ రావాలి. బిజేపిపై ఏపీ ప్రజలకు బాగా ఆగ్రహం ఉంది..ఇలాంటి పరిస్తితుల్లో బిజేపిని వదిలేసే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలా మారుతాయో?