మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు

-

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తంగా ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లుఉపసంహరించుకున్నారు. నిన్న పది మంది, ఇవాళ ముగ్గురు నామినేషన్లను ఉపసంహరించుకుని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇప్పటికే ఈ పార్టీలు ప్రచార పర్వాన్ని షురూ చేశాయి. ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం గుప్పిస్తూనే మరోవైపు ఇతర పార్టీలపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news