సీమలో 20.. టీడీపీకే అడ్వాంటేజ్..!

-

రాయలసీమ అంటే డౌట్ లేకుండా వైసీపీ అడ్డా అని చెప్పొచ్చు.. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీదే పైచేయి.. ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీపైనే పైచేయి సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందులో కూడా ఏ మాత్రం డౌట్ లేదనే చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ కొద్దో గొప్పో సీట్లు గెలుచుకుని, కోస్తాలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటే టీడీపీ అధికారం దక్కించుకోవచ్చు. అలా కాకుండా పూర్తిగా కోస్తాపై ఆధారపడితే టీడీపీకే నష్టం.

సీమలో మొత్తం 52 సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ 30, టీడీపీ 22 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ 49, టీడీపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వైసీపీనే మెజారిటీ సీట్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టీడీపీ ఓ 20 సీట్లు వరకైనా గెలుచుకుంటే కాస్త అధికారంలోకి రావడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా కలిపి 70 సీట్లు గెలుచుకున్నా.. సీమలో 20 గెలుచుకుంటే అధికారం దక్కుతుంది.

మరి సీమలో 20 సీట్లు గెలుచుకునే అవకాశాలు టీడీపీకి ఉన్నాయా? అంటే కొద్దో గొప్పో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 3 సీట్లు ఉన్నాయి.. వాటికి అదనంగా 17 సీట్లు సాధించాలి. ఇక ఇందులో ఎక్కువ టార్గెట్ అనంతపురంపైనే పెట్టాలి. ఆ జిల్లానే టీడీపీకి కంచుకోట. 2014లో ఈ జిల్లాలో 14 సీట్లకు 12 సీట్లు టీడీపీ గెలుచుకుంది. కాబట్టి ఇక్కడ కనీసం ఇప్పుడున్న రెండు సిట్టింగ్ సీట్లు కాకుండా..మరో 6-8 సీట్లు గెలుచుకుంటే బెటర్. అలాగే చిత్తూరులో కనీసం 4-6 సీట్లు, కర్నూలులో 4-6, కడపలో కనీసం రెండు సీట్లు అయిన గెలుచుకుంటే టీడీపీ టార్గెట్ రీచ్ అవుతుంది. అలా కాకుండా 2019 ఎన్నికల సీన్ రిపీట్ అయితే మళ్ళీ సీమలో టీడీపీకి దెబ్బ పడుతుంది. కొద్దో గొప్పో కోస్తాలో పరిస్తితి మెరుగు అవుతున్న నేపథ్యంలో సీమలో కాస్త కష్టపడి 20 సీట్లు గెలిస్తే టీడీపీ అధికారానికి దగ్గరవుతుంది. లేదంటే అంతే సంగతులు.

Read more RELATED
Recommended to you

Latest news