గ్రేటర్ వార్ కు అన్నీ భా…రీగానే  ?

-

దేశమంతా ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల పైనే దృష్టి పెట్టి ఆసక్తిగా ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలుసుకుంటోంది. అన్ని పార్టీలు ఆస్థాయిలో హడావుడి చేయడంతోనే ఈ ఎన్నికలు ఇంత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే, రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికలకు మొత్తం అన్ని ఏర్పాట్లు జిహెచ్ఎంసి పూర్తి చేసింది. ఒక ఎన్నికల కమిషన్ సైతం పగడ్బందీగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 150 వార్డుల్లో, 74.44 లక్షల ఓటర్లు ఉండగా, మొత్తం 1122 మంది ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కోసం 2600 పైగా దరఖాస్తులు వచ్చాయి. వార్డుకు ఒకరు చొప్పున 150 మంది రిటర్నింగ్ అధికారులు, 150 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. మొత్తం వార్డుల్లో 2,937 ప్రాంతాల్లో 9101 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారి అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, సహాయకులతో కలిసి నలుగురు చొప్పున 36,404 మంది సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అత్యంత సున్నితమైన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రత్యేక బలగాలను మోహరించారు. చోటుచేసుకునే పాతబస్తీ పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో శాంతి భద్రతల నిర్వహణకు 52,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 30 స్టాటిక్ సర్వే లైన్స్ బృందాలు ఏర్పాటు చేశారు.
పోలింగ్ తేదీ రోజున ఉదయం ఆరు గంటలకు పోలింగ్ ఏజెంట్లు అంతా అయా పోలింగ్ కేంద్రాల్లో 6 గంటలకు హాజరుకావాలని , 6 నుంచి 6.15 మధ్య మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 07 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిస్తుంది అని, పోలింగ్ సమయం ముగిసే సమయానికి లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించ బోతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఓటర్ గుర్తింపు కార్డు లేని వారికి 18 గుర్తింపు కార్డు లలో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చని ప్రకటించింది. అలాగే వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్ల ను ఏర్పాటు చేశారు. అలాగే మాస్క్ ధరించకుండా ఓటు వేసేందుకు వస్తే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించ కూడదు అని ఎన్నికల సంఘం  నిర్ణయించుకుంది.
మొత్తం గ్రేటర్ ఎన్నికలలో ని 150 డివిజన్లలో
టిఆర్ఎస్ 150, బిజెపి 149, కాంగ్రెస్ 147, టిడిపి 106, ఎంఐఎం 51, సిపిఐ 17, సిపిఎం 12, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్రులు 415 మంది ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news