సారీ.. అది అమరావతి కదా. చంద్రబాబు మాత్రం దాన్ని భ్రమరావతిగా మార్చేస్తున్నాడు. అప్పుడు గ్రాఫిక్స్ చూపించి.. అమరావతిని సింగపూర్, స్విట్జర్లాండ్, జపాన్, జర్మనీ.. చేస్తా అన్నాడు చంద్రబాబు. అవన్నీ భ్రమలే అయ్యాయి తప్పితే ఆ గ్రాఫిక్స్ నిజమయ్యింది లేదు. గత నాలుగున్నరేళ్లలో అమరావతిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఒక్క ఇటుకను కూడా జరుపలేదు.
అలా గ్రాఫిక్స్ తో ఏపీ ప్రజలను పిచ్చోళ్లను చేశాడు చంద్రబాబు. ఇప్పుడు మరోసారి పిచ్చోళ్లను చేయడానికి సిద్ధమయ్యాడు చంద్రబాబు. అదే గ్యాలరీ. అవును… అప్పుడు గ్రాఫిక్స్ భ్రమలతో మరిపించి.. ఇప్పుడు గ్యాలరీతో మురిపించనున్నాడు. గ్రాఫిక్స్ డిజైన్ల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నీళ్లార్పణం చేసినట్టుగానే.. ఇప్పుడు గ్యాలరీల పేరుతో మరో రూ.45 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని హాంఫట్ చేయనున్నాడు.
మీరు పైన చూస్తున్నారుగా ఫోటో అదే. అమరావతి భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పబోయే గ్యాలరీ అన్నమాట. ఈ గ్యాలరీని ప్రారంభించడం.. దానికి యాడ్స్ గట్రా. దానికి మరికొంత ఖర్చు. ఏతావాతా అర్థమయ్యేదేంటంటే.. చంద్రబాబు ఊహాలోకంలో జీవించడం తప్పా.. నిజ జీవితంలోకి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. అందుకే అమరావతిని భ్రమరావతిగా మార్చేశాడు. అయినా మన పిచ్చి కానీ.. ఐదేళ్లలోనే అమరావతిని నిర్మించేస్తారా? బాబుకు మరో వందేళ్లు అధికారం ఇస్తే.. అప్పుడు ఆలోచిస్తాడు భ్రమరావతిని నిర్మించడం.. సారీ.. అమరావతిని నిర్మించడం.