మెగా పవర్ స్టార్ రాం చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. 2019 సంక్రాంతి బరిలో జనవరి 11న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27న ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని తెలిసిందే. అయితే చిరుతో పాటుగా ఇంకా సర్ ప్రైజ్ గెస్టులు వస్తున్నారని తెలుస్తుంది.
ఎవరా సర్ ప్రైజ్ గెస్టులు అంటే ఒకరు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అయితే మరొకరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ ఓపెనింగ్ రోజు కలిసిన ఎన్.టి.ఆర్, చరణ్, ప్రభాస్ మరోసారి ఒకే వేదిక మీద కనబడుతున్నారట. రానా కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మెగా ఈవెంట్ లో ఎన్.టి.ఆర్, ప్రభాస్ రావడం మెగా ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు.
బయట పరిస్థితులు ఎలా ఉన్నా ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి ప్రతిసారి స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఈసారి మెగా ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ రావడం కన్ఫాం అయితే మరోసారి వారిద్దరు ఎంత కమిట్మెంట్ తో ఉన్నారో తెలుస్తుంది.