మధ్యలోనే ముగించిన అమిత్‌ షా రోడ్డు షో..!

-

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడ నుంచి నేరుగా చార్మినార్‌ బయల్దేరి వెళ్లారు. ద్రహోంమంత్రి అమిత్ షా నగరంలో పర్యటిస్తున్న నేపథ్యంలో బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. అమిత్ షా రోడ్‌ షోకు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రోడ్ షో నెమ్మదిగా ముందుకు కదలడంతో మధ్యలోనే ముగించారు. వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి ఫ్లై ఓవర్ వరకు సాగాల్సిన రోడ్‌షో.. నామాలగుండు వద్దే ఆగిపోయింది.

Amit-Shah
Amit-Shah

అంతకు ముందు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని అమిత్ షా సందర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయంలో హారతిచ్చారు అమిత్ షా. అనంతరం అక్కడి నుంచి క్వాన్యాయ్‌లో వారాసిగూడకు చేరుకున్నారు. వారాసిగూడ నుంచి నామాలగుండు వరకు రోడ్ షో నిర్వహించారు. అమిత్ షా రోడ్‌కు జనం భారీగా తరలివచ్చారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున అమిత్ షా రావడం తమకు ఎంతగానో ప్లస్ అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కార్యకర్తల్లో సరికొత్త జోష్ కనిపిస్తోందని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.దుబ్బాక విజయంతో ఊపుమీదున్న కాషాయ దళం..దాన్ని అలాగే కొనసాగించాలని పక్కాగా వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర నేతలతో పాటు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను రంగంలోకి దించింది. గ్రేటర్‌లో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదు. ఇక డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 4 కౌంటింగ్ జరిపి.. ఫలితాలను ప్రకటిస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లో ఎన్నికల అధికారులు బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news