బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి మళ్లీ ఎంపిక కానున్న అమిత్ షా..?

-

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌షానే మళ్లీ ఎంపికవుతారా? అంటే.. అందుకు అవును.. అనే సమాధానం వినిపిస్తోంది. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యూపీ ఎన్నికల విజయంలో అమిత్ షా పాత్ర ఎంతో ఉంది. అయితే తరువాత జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. దీంతోపాటు అటు ఆర్‌ఎస్‌ఎస్ కూడా అమిత్‌షాపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమిత్ షా తిరిగి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక కావడం కష్టమే అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అమిత్‌షా స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సంఘ్ పరివార్ డిమాండ్ చేస్తుండడం కూడా అమిత్ షాకు తలనొప్పిగా మారింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల మాట అటుంచితే.. రానున్న 5 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా తానే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అమిత్ షా మార్గం సుగమం చేసుకున్నారట. ఈ మేరకు ప్రధాని మోడీ, ఆయన కలసి ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు సర్ది చెప్పినట్లు తెలిసింది. 5 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిలో అమిత్ షాయే కొనసాగుతారని సమాచారం.

2019లో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అప్పటి వరకు అమిత్‌షానే బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగించాలని ప్రధాని మోడీ, పలువురు బీజేపీ ముఖ్య నేతలు కూడా భావిస్తున్నారట. అందుకనే మోడీ సపోర్ట్‌తో ఆ పదవిలో అమిత్ షా కొనసాగుతారని తెలిసింది. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ను మచ్చిక చేసుకోవడంలోనూ మోడీయే ముఖ్య పాత్ర పోషించారట. అందుకనే సంఘ్ పరివార్ సపోర్ట్‌తో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిలో అమిత్ షా కొనసాగుతారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో స్పష్టత ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news