బండి..ఆ నేతలు కావాలి..?

తెలంగాణలో బీజేపీ వేగంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ వస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 100 పైనే స్థానాల్లో కనీసం డిపాజిట్ తెచ్చుకోలేని బీజేపీ…ఇప్పుడు ఉపఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చేది బీజేపీ పార్టీనే అని ప్రచారం నడుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే పోరు నడుస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది…ఈలోపు రాజకీయం చాలా మారే అవకాశం ఉంది. ఇక రాజకీయానికి తగ్గట్టుగా బీజేపీ కూడా మరాల్సిన అవసరముంది. బీజేపీకి ఇప్పుడు మంచి విజయాలే వస్తున్నాయి. కానీ టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలంటే ఈ బలం మాత్రం సరిపోదు. బీజేపీ ఇంకా బలపడాలి.

ఇంకా చెప్పాలంటే బీజేపీకి బలమైన నాయకులు కావాలి. అసలు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో పోల్చుకుంటే 119 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నాయకులు లేరు. ఇప్పుడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచిందంటే కారణం…బలమైన నాయకులే. ఆ నాయకులకు ప్రజల్లో ఉన్న ఆదరణ బట్టే విజయం సాధించిందని చెప్పొచ్చు. అయితే 119 నియోజకవర్గాల్లో బీజేపీకి అలాంటి నాయకులు లేరు. ఏదో కొన్ని నియోజకవర్గాల్లోనే బీజేపీకి బలమైన నాయకులు ఉన్నారు. గట్టిగా తిప్పికొడితే బీజేపీలో కనీసం 50 నియోజకవర్గాల్లో కూడా బలమైన నాయకులు కనిపించరు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…ముందు బలమైన నాయకులని రెడీ చేయాలి.

వీక్ గా ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని పార్టీలోకి తీసుకుంటే బాగానే ఉంటుంది..అలాగే ఎన్నికలకు ఎలాగో రెండేళ్ళు ఉన్నాయి..కాబట్టి ఈలోపు ఆయా నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. అప్పుడే టీఆర్ఎస్‌కు బీజేపీ చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా విమర్శలు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇప్పటినుంచైనా బండి ఆ పనిలో ఉంటే బెటర్.