జగ్గారెడ్డిలో మరో కోణం..స్క్రిప్ట్ ఎవరిది?

-

తెలంగాణ కాంగ్రెస్‌లో టి‌పి‌సి‌సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యవహారం ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ప్రత్యర్ధులపై పోరాటం చేయాల్సిన నాయకుడు…సొంత పార్టీ నేతలపైనే పోరాటం చేస్తున్నారు. అయితే ఇలా జగ్గారెడ్డి ఎందుకు చేస్తున్నారు? నిజంగానే కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారా? లేక జగ్గారెడ్డి కావాలని రేవంత్‌ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారా? అనే డౌట్లు రాజకీయ విశ్లేషకులకు వస్తున్నాయి.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం జగ్గారెడ్డి…కావాలనే రేవంత్‌ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అనుమానిస్తున్నారు. పరోక్షంగా ఆయన కాంగ్రెస్‌కు నష్టం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. దీనికి పలు కారణాలు కూడా చెబుతున్నారు. ఎందుకంటే రేవంత్‌కు పి‌సి‌సి పదవి దక్కాక పలువురు సీనియర్లు వ్యతిరేకంగా గళం విప్పారు. అందులో జగ్గారెడ్డి కూడా ఉన్నారు. కానీ మిగతా సీనియర్లు కూల్ అయిపోయారు. జగ్గారెడ్డి మాత్రం ఏదొక సందర్భంలో రచ్చ చేస్తూనే ఉన్నారు.

పైగా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న విషయాలు వచిన్నప్పుడే జగ్గారెడ్డి రచ్చ చేస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత జగ్గారెడ్డి…రేవంత్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓటమి గురించి చర్చ నడవాలి. కానీ కాంగ్రెస్‌కు డిపాజిట్ రాకపోవడం, జగ్గారెడ్డి విమర్శలు హైలైట్ అయ్యాయి. రిజల్ట్ రోజు పనిగట్టుకుని జగ్గారెడ్డి ఒక మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి, రేవంత్‌పై విమర్శలు చేశారు.

ఇటీవల వరి పంట వేయొద్దని కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చెప్పిన విషయం తెలిసిందే. రైతులకు అలా చెప్పి కేసీఆర్ మాత్రం…తన ఫామ్ హౌస్‌లోని 150 ఎకరాల్లో వరి పండిస్తున్నారని రేవంత్ విమర్శలు చేశారు. దానికి సంబంధించిన వివరాలు బయటపెట్టారు. అలాగే ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లికి వెళ్ళి రచ్చబండ పెడతానని అన్నారు.

ఇదే సమయంలో తనని పిలవకుండా కార్యక్రమం చేయడం ఏంటని చెప్పి…జగ్గారెడ్డి, రేవంత్‌పై ఫిర్యాదు చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశారు. వ్యక్తిగతంగా రాసిన లేఖ బయటకు లీక్ చేశారు. దీంతో కాంగ్రెస్‌లో రచ్చ మొదలైంది. అసలు కేసీఆర్ వరి పండిస్తున్నారనే వ్యవహారం పక్కకు వెళ్ళి…జగ్గారెడ్డి రచ్చ హైలైట్ అయింది. అంటే ఇదంతా జగ్గారెడ్డి కావాలని టీఆర్ఎస్‌కు ఇబ్బంది రాకుండా, కాంగ్రెస్‌ని దెబ్బకొట్టడానికి చేస్తున్నారా? అనే డౌట్ కాంగ్రెస్ శ్రేణులు వ్యక్త పరుస్తున్నాయి. మరి జగ్గారెడ్డి వర్షన్ ఏంటో మాత్రం క్లారిటీ రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news