కమలం ఖాతాలో మరో సీటు?

-

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ…119 నియోజకవర్గాల్లో సంస్థాగతంగా బలపడటమే లక్ష్యంగా పనిచేస్తుంది…ఇప్పటివరకు 5 లోపు సీట్లకు పరిమితమైన కమలం…ఈ సారి 60 సీట్లని టార్గెట్ చేసుకుంది. ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఇదే క్రమంలో ప్రతి నియోజకవర్గంపై ఫోకస్ చేసి…పనిచేస్తుంది. ఎక్కడికక్కడ బలోపేతం కావడంపై దృష్టి పెట్టింది.

ఈ క్రమంలోనే కమలం పార్టీ…వేములవాడ నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది…ఎందుకంటే ఇక్కడ బీజేపీకి గెలిచే బలం ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఈ సీటు ఖచ్చితంగా తమ ఖాతాలో పడుతుందని కమలనాథులు ధీమాగా ఉన్నారు. అందుకే ఈ సీటు కోసం పోటీ కూడా పెరిగింది. ఈ సీటులో పోటీ చేయాలని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమా చూస్తున్నారు. అటు ఈ సీటుపై సిరిసిల్ల బీజేపీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ కూడా కన్నేశారు.

అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఈ సీటుపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత రెండు ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఇక ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. అయితే టీఆర్ఎస్ బలంగా ఉన్న కరీంనగర్ అసెంబ్లీ సీటు కంటే బీజేపీ బలంగా ఉన్న వేములవాడ సీటు అయితే బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ వేములవాడలో బండి పోటీ చేస్తే…విజయం నల్లేరు మీద నడకే. బండి కాకుండా వేరే బీజేపీ అభ్యర్ధి ఎవరు పోటీ చేసిన కూడా వేములవాడ కమలం ఖాతాలోనే పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై ఫుల్ నెగిటివ్ ఉంది..పైగా ఆయన పౌరసత్వం ఇష్యూపై కేసు నడుస్తోంది. అలాగే చెన్నమనేని వేములవాడ ప్రజలకు అందుబాటులో ఉండరు.  దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇస్తే మళ్ళీ గెలవడం కష్టమని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.

ఇక వేములవాడలో కాంగ్రెస్ బలహీనపడింది…అదే సమయంలో ఇక్కడ బీజేపీకి ఆదరణ పెరిగింది..దీంతో నెక్స్ట్ వేములవాడలో బీజేపీ గెలుపు ఖాయమని తెలుస్తోంది. వేములవాడ సీటుని బీజేపీ ఖాతాలో వేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news