టీఆర్ ఎస్‌కు మ‌రో షాక్‌.. కీల‌క నేత రాజీనామా.. ఈట‌ల‌కు జై!

తెలంగాణ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. ఎన్నో మ‌లుపుల త‌ర్వాత ఈట‌ల రాజేంద‌ర్ త‌న టీర్ఎస్ ప‌ద‌వికి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగాయి. అయితే ఆయ‌న ఏ పార్టీలో చేర‌తార‌నేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ ఆయ‌న వెంటే ప‌లువురు కీల‌క నేత‌లు రాజీనామా చేశారు.

ఈట‌ల వెంటే తుల ఉమ‌, ర‌వీంద‌ర్‌రెడ్డి, ఇత‌ర నేత‌లు రాజీనామా చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు మ‌రో కీల‌క నేత‌ల టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఆయ‌న కూడా ఈట‌ల ప్ర‌ధాన సన్నిహితుడు కావ‌డం గ‌మ‌నార్హం.

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈటలతో బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు బాబయ్య ప్ర‌క‌టించారు. ఈట‌ల లాంటి నాయ‌కుడు కేసీఆర్‌కు దొర‌క‌ర‌ని వెల్ల‌డించారు. ఉద్య‌మ‌నాయ‌కుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈట‌ల వెంట‌నే తాను ఉంటాన‌ని, ఎలాంటి ప్ర‌లోభాల‌కు లొంగేది లేద‌ని తేల్చి చెప్పారు.