సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం & మాజీ సీఎం బర్త్ డే విషెస్..!

-

రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రగతిభవన్‌కు కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి నేతలు క్యూకడుతున్నారు. అలాగే మ‌రోవైపు సీఎం కేసీఆర్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రియు మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆయ‌న ట్విట‌ర్ ఖాతాలో “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను” అని తెలిపారు.

అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేటర్‌కు ట్విట్టర్‌లో అభినందన సందేశాన్ని ఉంచారు. ‘మీకు ఎల్లప్పుడూ ఆ దేవుని కృప ఉండాలి. మీరు ఆయురారోగ్యాలతో చిరకాం వర్ధిల్లాలి. సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనాగాలి. మీకు హార్ధిక శుభాకాంక్షలు’ అంటూ జగన్‌ ట్వీట్‌ చేశారు. కాగా, సోమవారం సీఎం కేసీఆర్‌ తన 67వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే ఆయ‌న‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news