ఏపీలో పోలింగ్, ఓటర్ల వివరాలు…

-

గత నెల రోజుల నుండి ప్రచారాలతో హోరిత్తించిన రాజకీయ పార్టీలు నేటితో ప్రచారానికి పులిస్టాప్ పెట్టేశాయి. ఇంకో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 3 లక్షల మంది ఎన్నిక సిబ్బంది పనిచేయనున్నారు. ఓటర్ల సంఖ్యా, పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు..

ఏపీలో మొత్తం ఓటర్లు – 3,93,45,717 . మొత్తం ఓట‌ర్ల‌లో పురుషులు 1,83,24,588 మంది, మహిళా ఓటర్లు 1,86,04,742 మంది ఉన్నారు. అలాగే, థర్డ్ జెండర్స్‌ 3,761 మంది ఓటర్లు ఉన్నారు.

సర్వీసు ఓటర్లు- 56,908
ప్రవాసాంధ్ర ఓటర్లు- 5,323
దివ్యాంగ ఓటర్లు- 5,27,734
కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య- 10,15,219

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు- 45,920
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 9000
రాష్ట్రంలో ఎన్నికల సిబ్బంది- 3 లక్షలు
పోలీస్ బలగాలు- ఒక లక్షా 20 వేల మంది
ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలు, బలగాల రవాణాకు వినియోగించే బస్సులు – 7600

Read more RELATED
Recommended to you

Latest news