ఏపీలో నలిగిపోతున్న పోలీసులు…?

-

సాధారణంగా అధికార పార్టీ నేతల విషయంలో పోలీసులు కాస్త అనుకూలంగా ఉంటారు. విపక్షాల విషయంలో కాస్త కఠిన వైఖరి ప్రదర్శిస్తూ ఉంటారు. అది ఎక్కడైనా సరే జరిగేదే. మరీ వంగితే చట్టం బెండ్ అయిపోతుంది. చట్టం బెండ్ అయిపోతే లాఠీ దెబ్బ గట్టిగా తగలదు. ఎఫ్ఐఆర్ కి విలువ ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు బెండ్ అయ్యారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. తెలుగుదేశం ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పినట్టు చేసారు.

ఇప్పుడు జగన్ వచ్చారు కాబట్టి జగన్ చెప్పినట్టు చేస్తున్నారు. చేసారు, చేస్తారు… కాని ఇప్పుడు వాళ్ళు అన్ని విధాలుగా నలిగిపోతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీసులు విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ని అడ్డుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుని అడ్డుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే అప్పుడు తనను అడ్డుకున్న వారికి చుక్కలు చూపించారు.

ఇప్పుడు చంద్రబాబుని అడ్డుకున్న వాళ్ళు భవిష్యత్తులో ఇబ్బంది పడుతున్నారు. మంత్రులు చెప్పినట్టు చెయ్యాలి, ముఖ్యమంత్రి మాట కాదని అనకూడదు. కాదని అంటే ఇబ్బందులు తప్పవు. అలా అని సొంతగానూ నిర్ణయాలు తీసుకోలేరు. ఎన్ని విధాలుగా చూసినా సరే పోలీసులు నలిగిపోతున్నారు అనేది వాస్తవం. రాజకీయం చేయవచ్చు గాని అది అధికారుల చుట్టూ తిరిగితే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుంది.

మంత్రుల మాట వినవచ్చు తప్పు లేదు, కాని భయపడితే మాత్రం అధికారులకే ప్రమాదం. విశాఖ విమానాశ్రయం లో ఇప్పుడు పోలీసులు చేసింది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వినపడుతుంది. ఒక వర్గానికి అది నచ్చవచ్చు ఏమో గాని చట్టానికి నచ్చదు. అప్పుడు విశాఖలో పోలీసుల వైఖరి కూడా ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. రాజకీయ నాయకులు కక్ష సాధింపు కోసం అధికారులను ఎంచుకోవడం నీచం, దరిద్రం అనేది పరిశీలకుల మాట.

Read more RELATED
Recommended to you

Latest news