సోమవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో శాసనమండలి రద్దు కు ఆమోదం ఏపీ అసెంబ్లీ తెలిపింది. దీంతో ప్రస్తుతం ఈ బిల్లును పార్లమెంటుకు జగన్ సర్కార్ పంపనుంది. పార్లమెంటులో కూడా ఈ బిల్లుకు ఆమోదం వస్తే కనుక శాసన మండలి రద్దు అవ్వటం రాష్ట్రంలో గ్యారెంటి. ఒకవేళ కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలు ఈ బిల్లును అడ్డంపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తే గనుక జగన్ సర్కార్ తీవ్ర ఇరకాటంలో పడినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
దీంతో ఈ పాయింట్ ఆఫ్ డైరెక్షన్లో జగన్ సరిగ్గా ఆలోచించి ఉంటే బాగుండేదని ఏ మాత్రమైనా బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనుకుంటే ఇదే టైం కనుక…ఈ పాయింట్ డైరెక్షన్లో జగన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని పైగా జనసేన ఇటీవల బీజేపీ పార్టీ తో పొత్తులు పెట్టుకోవటం తో ముందు నుండి అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేస్తున్న తరుణంలో బిజెపి మరియు జనసేన పార్టీ వర్గాలు శాసన మండలి రద్దు బిల్లును హోల్డ్ లో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.
మరోపక్క వైసీపీ పార్టీ నేతలు కూడా జగన్ రాంగ్ స్టెప్ తీసుకున్నారని ఒక సంవత్సరం ఆగితే శాసనమండలిలో వైసిపి పార్టీ దే మెజార్టీ…ఆవేశంగా జగన్ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని సొంత పార్టీలో నేతలు గుసగుసలాడుతున్నారు.