ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నానా కష్టాలు పడుతు౦దనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ పార్టీని బ్రతికించుకోవడానికి గాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగానే కష్టపడుతున్నారు. ఇన్నాళ్ళు ఆ పార్టీది ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్ కాబట్టి చంద్రబాబు ఏది చేసినా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి చెయ్యాల్సి ఉంటుంది. జగన్ ని తక్కువ అంచనా వేసిన చంద్రబాబు ఎన్నికల్లో ఊహించని విధంగా షాక్ తిని సైలెంట్ అయ్యారు.
అయితే ఆ తర్వాత ఆ పార్టీలో చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేక చాలా మంది యువనేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు జగన్ విలువలు పక్కన పెట్టి పిలిస్తే కండువాలు కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారు. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే చంద్రబాబు జాగ్రత్తపడటం లేదు. నవంబర్ లో తెలుగుదేశం పార్టీకి గుడ్ బాయ్ చెప్పి వైసీపీలో జాయిన్ అయ్యారు విజయవాడకు చెందిన యువనేత దేవినేని అవినాష్.
ఆయన పార్టీని వీడిన తర్వాత ఆయన పోషించిన తెలుగు యువత బాధ్యతలను ఇప్పటి వరకు కూడా చంద్రబాబు భర్తీ చేసిన పాపాన పోలేదు. చాలా మంది యువనేతలు ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా ఆ పదవి భర్తీ కాకపోవడం ఆ పార్టీ కార్యకర్తల్లో అసహనానికి కారణంగా మారింది. రాయలసీమలో యువనేతలు ఉన్నారు, ఉత్తరాంధ్రలో ఉన్నారు. అయినా సరే చంద్రబాబు మాత్రం ఆ పదవిని భర్తీ చేయడం లేదు. దీనితో కొందరు సీనియర్లు కూడా చిరాకు పడుతున్నారు. పైకి చెప్పలేక లోపల లోపల మధన పడుతున్నారు.