రూటు మార్చిన బాలయ్య..ఇక ఫుల్‌ టైమ్‌ పాలిటిక్స్‌

ఫుల్‌ టైమ్‌ పాలిటిక్స్‌లోకి వచ్చినా పార్ట్‌ టైమ్‌గా పనిచేస్తున్న బాలయ్య ఇప్పుడు సడన్ గా రూటు మార్చారా.. హిందూపురం తప్ప మరేమీ పట్టని ఆయన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారా..వైసీపీని టార్గెట్ చేస్తూ మంత్రి కొడాలి నానికి కౌంటర్లు వేయడం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.

సినిమా హీరోగా బిజీగా ఉంటూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి వరసగా రెండోసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. బాలకృష్ణ దేనినీ సీరియస్‌గా తీసుకోరనే ప్రచారం ఉంది. ఒకవేళ సీరియస్‌గా తీసుకుంటే మాత్రం ఆ సీన్‌ వేరేలా ఉంటుందని టాక్‌. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇప్పుడు విపక్ష శాసనసభ్యుడిగా ఉన్నా రాజకీయాలు ఆయనకు పార్ట్‌ టైమ్‌ అని భావించేవారు బాలయ్యను చూసేవారు. అలాంటి బాలకృష్ణ ఒక్కసారిగా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.

హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మూడు నెలలకు ఒక్కసారి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించి, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వెళ్తుంటారు. అది అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాతైనా అంతే. ఇక హిందూపురం పాలిటిక్స్ తప్ప ఆయన ఇతర విషయాలపై పెద్దగా పట్టించుకోరు. ఏ అంశం గురించి కూడా మాట్లాడరు. కాని ఈ సారి మాత్రం బాలయ్య బాబు రూట్ మార్చారు. హిందూపురం కేంద్రంగానే స్టేట్ పాలిటిక్స్ పై దృష్టి సారించారు. రైతు సమస్యల దగ్గరి నుంచి విగ్రహాల కూల్చివేత వరకు అన్నింటిపైనా బాలయ్య స్పందిస్తున్నారు. వైసీపీ పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నారు.

వాస్తవంగా బాలక్రిష్ణ హిందూపురం వచ్చి చాలా రోజులు అవుతోంది. ఆయన మూడు నెలలకు ఒకసారి అలా వస్తుంటారు. వచ్చినప్పుడు తన పని తాను చేసుకుంటూ నియోజకవర్గంలో టీడీపీ నేతలతో కలసి వెళ్తుంటారు. అలాగే ఈ సారి కూడా మూడు రోజుల టూర్ ప్లాన్ చేశారు. కేవలం కార్యకర్తల పరామర్శ మాత్రమే షెడ్యూల్ లో ఉండేది. కానీ బాలయ్య ఈ టూర్ లో చాలా ఢిఫరెంట్ గా అడగులు వేశారు. జిల్లాలోకి వచ్చి రాగానే వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని.. అసలు రైతుల గురించి పట్టించుకోవడం లేదని.. గిట్టుబాటు ధర, ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ వంటి అంశాలపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. రైతులను, కార్మికులను పరామర్శిస్తూ టూర్ కొనసాగించారు…

అలాగే ఇప్పుడు స్టేట్ లో హాట్ టాపిక్ గా ఉన్న విగ్రహాల కూల్చివేత, పేకాట వంటి విషయాలపై కూడా బాలయ్య రియాక్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం కనీసం ఆలయాలకు కూడా రక్షణ కల్పించలేకపోతోందని.. తమ ప్రభుత్వం హయాంలో ఒక్క ఆలయం కూడా కూల్చలేదని.. ఒక వేళ అలా చేసినా అది ప్రజా ప్రయోజనం, ప్రజా మద్దతుతోనే చేశామని చెప్పుకొచ్చారు. అలాగే టీడీపీపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసే నానికి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్టాడలని.. తాము ఇలా మాట్లాడం అని.. చేతల ద్వారానే చూపిస్తామన్నారు.

ఇలా బాలయ్య ఎప్పుడూ లేని స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడటం చూస్తే.. ఆయన ఫోకస్ ఇక నుంచి స్టేట్ పైనే ఉంటుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. మరి బాలయ్య రాకతో పార్టీకి బూస్ట్ వస్తుందేమో చూడాలి.