బీజేపీ యాంటీ: కేసీఆర్ రెడీ..బాబు రిస్క్ చేస్తారా?

-

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఏ స్థాయిలో పోరాడుతున్నారో అందరికీ తెలిసిందే…ఎలాగైనా కేంద్రంలో బీజేపీని గద్దె దించాలని చెప్పి కేసీఆర్…కేంద్ర రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. బీజేపీయేతర పార్టీలని ఏకం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే దేశంలో విపక్ష నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఓ వైపు రాష్ట్రంలో బీజేపీతో పోరాడుతూనే..మరోవైపు కేంద్రంలో బీజేపీ టార్గెట్ గా రాజకీయం నడుపుతున్నారు. బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో కేసీఆర్ ముందుకెళుతున్నారు.

అయితే ఇప్పుడు కేసీఆర్ ఏం చేశారో…సరిగగా 2019 ఎన్నికల ముందు చంద్రబాబు అదే చేశారు. సడన్ గా బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చి..ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పి…బాబు, బీజేపీపై పోరాటాలు మొదలుపెట్టారు. మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా…విపక్ష పార్టీ నేతలని కలిశారు..వారిని ఏకం చేశారు. అలాగే బద్ధశత్రువు అయిన కాంగ్రెస్ పార్టీని సైతం కలిశారు. రాహుల్ గాంధీతో చేతులు కలిపారు.

ఇలా మోదీకి వ్యతిరేకంగా అన్నీ కార్యక్రమాలు చేశారు. జాతీయ స్థాయిలో ధర్మ పోరాట ధీక్షలు చేశారు. ఇన్ని చేసిన బాబు…బీజేపీని ఏం చేయలేకపోయారు. పైగా రాష్ట్రంలో బాబు అధికారం కోల్పోయారు. అటు కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దీంతో బాబు సైలెంట్ అయ్యి..మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ …మోదీ సర్కార్‌పై పోరాటం చేస్తున్నారు.

ఇదే క్రమంలో చంద్రబాబు-కేసీఆర్ ఒకే వేదికపైకి వచ్చే కార్యక్రమం ఒకటి జరగనుంది. ఈనెల 25వ తేదీన హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ర్యాలీ జరగనుంది. మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ జయంతిని పురస్కరించుకొని ఐఎన్ఎల్ డీ ప్రధాన కార్యదర్శి అభయ్ చౌతాలా..కేసీఆర్, చంద్రబాబుతోపాటు దేశంలోని కీలక నేతలందరినీ ఈ ర్యాలీకి ఆహ్వానించారు. ఇంకా చెప్పాలంటే ఈ ర్యాలీ…యాంటీ బీజేపీ ర్యాలీ..విపక్ష నేతలంతా ఈ ర్యాలీలో ఉంటారు. అయితే బీజేపీపై పోరాడుతున్న కేసీఆర్ ఈ ర్యాలీకి వెళ్ళే ఛాన్స్ ఉంది…కానీ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్న బాబు..ఈ ర్యాలీకి వెళ్ళే రిస్క్ చేస్తారా? లేదా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news