గోషామహల్ లో బీజేపీ హ్యాట్రిక్…!

-

  • వరుసగా మూడోసారి బరిలో నిలబడిన ఎమ్మెల్యే రాజసింగ్
  • సునాయాస విజయం ఖాయమంటున్న ఓటర్లు
  • బీఆర్ఎస్ కి ఈసారి కూడా భంగపాటే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కి సమయం సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకుని చట్టసభలకు వెళ్లే అవకాశం కల్పించాలని కోరుతూ ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు.అయితే గోషామహల్ లో కూడా ఈసారి బీజేపీ కి అనుకూల పవనాలు వీస్తున్నాయి. వరుసగా మూడోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ నే విజయం వరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్‌,బీజేపీ, కాంగ్రెస్‌లతో సహా ప్రజా ఏక్తా పార్టీ ధర్మ సమాజ్‌ పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్ధులు ఎన్నికల బరిలో తలపడుతున్నారు.

బిఆర్‌ఎస్‌ అధిష్టానం గోషామహల్‌ ఇన్‌చార్జ్‌ నందకిశోర్‌ వ్యాస్‌ని ఎమ్మెల్యే అభ్యర్దిగా నిలబెట్టింది.దీంతో రాజసింగ్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన మహిళా కాంగ్రెస్‌ రాష్ర్ట అధ్యక్షురాలు మొగిలి సునీతారావును ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారు చేసింది. అయితే స్థానికేతరులైన సునీత కి ఇక్కడ సహాయ నిరాకరణ మొదలైంది.అయితే 2009లో దివంగత మాజీ మంత్రి ఎం ముఖేష్‌ గౌడ్‌ గోషాహల్‌ నుంచి విజయం సాధించి రాష్ర్ట మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రతి గడపకు వెళ్తున్న సునీత రావ్ అటు ముకేశ్ చేసిన అభివృద్ధిని, ఇటు ఇందిరమ్మ సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాన ఏర్పాటు తరువాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించడంతో ఈసారి రాజసింగ్ కు చెక్ పెట్టాలనే బలమైన సంకల్పంతో ఎలాగైనా ఇక్కడ బోణీ కొట్టాలన్న యోచనతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం బలమైన అభ్యర్ధిని రంగంలోకి దిందింపేందుకు తొలి జాబితాలో గోషామహల్‌ అభ్యర్ధిని ప్రకటించలేదు.

బలమైన అభ్యర్ధి కోసం అంతర్గత సర్వే నిర్వహించి స్థానికంగా ఉంటూ గత 25 ఏళ్ళుగా ప్రజలతో సత్సంబంధాలు కలిగిన నందకిశోర్‌ వ్యాస్ పేరును చివరిక్షణంలో ఖరారు చేసింది. దీంతో బీఆర్‌ఎస్‌ లో కూడా వర్గపోరు తప్పలేదు. అసంతృప్త నేతలను బుజ్జగించడంతో పాటు వారు పార్టీ నుంచి జారీపోకుండా కాపాడుకోవడంపైనే బీఆర్ఎస్ అధినాయకత్వం ఫోకస్‌ పెట్టింది. ఈ కారణంతో నందకిశోర్ వ్యాస్ ఆలస్యంగా ప్రచారం మొదలు పెట్టాల్సిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి.అటు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలానే ఉంది.

సార్వత్రిక ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి జాతీయ పార్టీలైన బీజేపీ,కాంగ్రెస్‌ పార్టీలతో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీజేపీ,బీఆర్‌ఎస్‌ ల మధ్యే ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో నూతన ఓటర్ల చేరికతో మొత్తం 2 లక్షల 70 వేల పైచిలుకు ఓట్లు ఉండగా వీటిలో 70 వేల వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. 12 వేల మంది క్రైస్తవులు,35 వేల ఎస్సీ ఓటర్లు,35 వేల బీసీ ఓటర్లుండగా దాదాపు లక్షకుపైగా ఓట్లు సెటిలర్లవే కావడం గమనార్హం.ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు సునాయాసంగా గెలిచిన రాజాసింగ్ కే ఈసారి కూడా గెలుపు తలుపు తట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version