కమలంలో కవిత చిచ్చు..బండికి సెగలు.!

-

తెలంగాణ బీజేపీలో ఊహించని ట్విస్ట్ వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సొంత పార్టీ నేతలే యాంటీగా మారారు. ఆయన ఇటీవల కవితపై చేసిన వ్యాఖ్యలని సమర్ధించడం లేదని కొందరు నేతలు మాట్లాడటం సంచలనంగా మారింది. కవిత ఈడీ విచారణ ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఆమెఅని టార్గెట్ చేసి అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని కామెంట్ చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలు ఎప్పుడో చేశారు..కానీ బి‌ఆర్‌ఎస్ శ్రేణులు మాత్రం కవిత ఈడీ విచారణ ఎదుర్కున్న మార్చి 11న ఆందోళనలు చేశారు. బండి దిష్టి బొమ్మలని దగ్ధం చేశారు. ఈ క్రమంలో బి‌జే‌పి నేతలు బండికి మద్ధతుగా నిలిచారు. బండి అన్న మాటల్లో తప్పు లేదని డి‌కే అరుణ లాంటి వారు మాట్లాడారు. కానీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం…బండి వ్యాఖ్యలని ఖండించారు. సొంత పార్టీ ఎంపీ అయినా సరే బండి..కవితపై చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.

BJP MP Arvind: అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదంటూ బండి సంజయ్‌పై ఎంపీ అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించనని అర్వింద్‌ అన్నారు. బండి సంజయ్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని,  అధ్యక్ష పదవి అనేది పవర్ సెంటర్ కాదు.. కోఆర్డినేట్ సెంటర్‌ అంటూ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, సంజయ్ వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం ఉందని తాను ఒప్పుకోను అని, సంజయ్‌ వ్యాఖ్యలకు ఆయనే వివరణ ఇచ్చుకోవాలని అర్వింద్‌ స్పష్టం చేశారు.

ఇటు ఇతర బి‌జే‌పి నేతలు కూడా బండి టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. తెలంగాణ లో కే‌సి‌ఆర్ గ్రాఫ్ తగ్గుతున్న సమయంలో బండి ఇలా మాట్లాడి..బి‌జే‌పికి నష్టం చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు ఏ మాత్రం సమర్ధనీయం కాదని కొందరు బి‌జే‌పి నేతలు ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news