కమలం ఆపరేషన్: నల్గొండలో ఇంకా ఉన్నారా?

-

ఏదేమైనా గాని తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళుతుంది…పైకి రాజకీయంగా దూకుడుగా ఉంటూనే..గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పదునైన వ్యూహాలతో టీఆర్ఎస్ పార్టీకే షాక్ ఇచ్చేలా ముందుకెళుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కూడా దెబ్బకొడుతూ కమలం దూసుకెళుతుంది. ఇప్పటివరకు కేసీఆర్ వ్యూహాలు అర్ధం కావడమే కష్టమని, వ్యూహాలు అర్ధమయ్యే లోపే కేసీఆర్ తన పని తాను చేసుకుని వెళ్లిపోతారనే పరిస్తితి ఉండేది.

కానీ ఇప్పుడు సీన్ మారింది…కమలం పార్టీ కూడా కేసీఆర్ కు ధీటుగా వ్యూహాలు రచిస్తుంది..ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా వ్యూహాలు అమలు చేస్తుంది. ఇలా పదునైన వ్యూహాలతోనే బలమైన నాయకులని పార్టీలోకి లాగుతున్నారు. ఇప్పటికే కమలం పార్టీలోకి బలమైన నేతలు చాలామంది వచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని, అటు కాంగ్రెస్ పార్టీని నిలువరించాలంటే ఇప్పుడున్న బలం సరిపోదు..ఇంకా చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నేతలు కావాలి.

ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కూడా బీజేపీకి మెజారిటీ నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేరని తేలింది…ఒకవేళ బలమైన నాయకులని లాగితే ఎన్నికల్లో సత్తా చాటే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్పాయి. అందుకే బీజేపీ..ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో స్ట్రాంగ్ ఉన్న నాయకులని లాగే పనిలో పడింది.

ఈ క్రమంలోనే తమకు ఏ మాత్రం బలం లేని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది…ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకోస్తున్న విషయం తెలిసిందే. అయితే నల్గొండలో ఇంకా పలువురు నాయకులపై కమలం పార్టీ వల వేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి…అందుకే ఆ రెండు పార్టీల్లో ఉన్న బలమైన నేతలని లాగేయాలని చూస్తుంది.

కోమటిరెడ్డితో పాటు పలువురు నేతలని బీజేపీలో చేర్చుకోవడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. కోమటిరెడ్డి బీజేపీలో చేరే సమయంలో ఊహించని విధంగా కొందరు కీలక నేతలు కూడా కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. మరి చూడాలి నల్గొండలో కారు దిగేవారు…కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారో.

Read more RELATED
Recommended to you

Latest news