తెలంగాణలో పాగా వేయడం కోసం కమలం పార్టీ ఎప్పటికప్పుడు అదిరిపోయే స్కెచ్ లు వేస్తుందనే చెప్పొచ్చు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి..నెక్స్ట్ అధికారంలోకి వచ్చేయాలని బీజేపీ పనిచేస్తుంది…ఆ దిశగానే బీజేపీ దూసుకెళుతుంది. అయితే బీజేపీ ఊహించని స్కెచ్ తో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. అసలు పైకి టీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తునా సరే గ్రౌండ్ లెవెల్ లో కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
కమలం నేతలు టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. దీని వల్ల టీఆర్ఎస్ వైఫల్యాలు బయటపడతాయి. అయితే గ్రౌండ్ లెవెల్ లో బలపడాలంటే ఇలా విమర్శలు చేస్తే సరిపోదు. పైగా ఈ విమర్శల వల్ల టీఆర్ఎస్ కు నెగిటివ్ అయితే…ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు కాస్త బెనిఫిట్ అవ్వోచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్ లో దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగో టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఉంది..దీంతో ఆ పార్టీ వైపు ప్రజలు ఈ సారి చూసే అవకాశాలు తక్కువ ఉన్నాయి.
కానీ కాంగ్రెస్ పై ఆ వ్యతిరేకత లేదు. దీని వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్తితి ఉంటుంది. దాని వల్ల బీజేపీకి నష్టం ఉంటుంది. అందుకే గ్రౌండ్ లెవెల్ లో కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడమే లక్ష్యంగా బీజేపీ వెళుతుంది…వ్యతిరేకత ఉన్న టీఆర్ఎస్ నేతలని పార్టీలో చేర్చుకోవడం కంటే…స్ట్రాంగ్ అవుతున్న కాంగ్రెస్ నేతలని చేర్చుకుంటే బెనిఫిట్ ఉంటుందని భావిస్తున్నారు. ఆ దిశగానే కమలం ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలువురు నేతలు కమలం పార్టీతో టచ్ లో ఉన్నారు..త్వరలోనే వారు కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ బలం…బీజేపీకి వస్తుంది. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీల మధ్య ఫైట్ అన్నట్లు ప్రజలు చూస్తారు..అప్పుడు బీజేపీకి లబ్ది చేకూరే ఛాన్స్ ఉంది.