-
తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఏర్పడింది ఖాళీలను భర్తీ చేయడానికి తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరికి అవకాశం ఇస్తారు అనేది ఇప్పుడు ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అయోధ్య రామిరెడ్డి, చిరంజీవి, వైయస్ షర్మిల, పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి.
అదేవిధంగా కర్నూలుకు చెందిన మాజీ కేంద్రమంత్రి ఒకరికి రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత కు అవకాశం దక్కే సూచనలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వార్త బయటకు వచ్చింది. వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువ.
ఈ నేపథ్యంలోనే బలం పెంచుకోవడానికి గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా లాలూచీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని రెండు స్థానాలు అడిగిన బీజేపీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కూడా ఒక స్థానం అడుగుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే టీఆర్ఎస్ లోక్‌సభ ఎంపీలను కేంద్ర మంత్రులు చేస్తామని కేసీఆర్‌కి ఆఫర్ కూడా ఇచ్చినట్టు సమాచారం. మరి కేసీఆర్ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.