బ్రేకింగ్; రాజకీయాల్లోకి సైనా నెహ్వాల్, బిజెపి ద్వారా…!

-

ఢిల్లీ ఎన్నికల నేపధ్యంలో బిజెపి విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి దేశంతో పాటుగా దేశ రాజధానిని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని బిజెపి భావిస్తుంది. ఇందుకోసం ఎలా అయినా సరే విపక్షాలను దెబ్బ కొట్టడానికి గాను బిజెపి అగ్ర నాయకత్వం అన్ని వ్యూహాలను సిద్దం చేస్తుంది. 2015 లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనితో ఎలా అయినా సరే ఈ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడానికి బిజెపి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి టీం ఇండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ని రంగంలోకి దింపింది. ఏడు ఎంపీ స్థానాలను పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కైవసం చేసుకోవడం సంచలనంగా మారింది.

ఢిల్లీ ఎన్నికల్లో కూడా విజయం కోసం ఇప్పుడు స్టార్లను రంగంలోకి దింపుతుంది. బిజెపిలోకి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ని ప్రచారానికి వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఇప్పటికే అమిత్ షా ని కూడా కలిసారు. త్వరలో బిజెపి నూతన జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుని ఎన్నికల్లో ప్రచారం చెయ్యాలని సైనా భావిస్తుంది. ఆమె పొలిటికల్ ఎంట్రీ దాదాపుగా ఖాయమైంది.

Read more RELATED
Recommended to you

Latest news