తెలంగాణలో బిజేపి రోజురోజుకూ బలపడుతున్న విషయం తెలిసిందే..అధికార బిఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టి నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా బిజేపి వదులుకోకుండా రాజకీయం చేస్తుంది. అటు కేంద్రం పెద్దలు సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టి రాజకీయం నడిపిస్తున్నారు. గ్యాప్ లేకుండా వారు కూడా తెలంగాణకు వచ్చి..బీజేపీని పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక బీజేపీని అడుగడుగున నిలువరించేందుకు ఇటు కేసిఆర్ సైతం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇప్పటికే బిఆర్‌ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో బిజేపికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇటు రాష్ట్రంలో కూడా బిజేపికి చెక్ పెట్టి మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే జిల్లాల వారీగా కేసిఆర్ భారీ సభలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఖమ్మంలో బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ పెట్టారు.
అయితే ఇదే ఊపులో హైదరాబాద్ పరిధిలో భారీ సభకు కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ బిజేపి ఇప్పటికే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ సభ పెట్టి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. మోదీ పాల్గొన్న సభ భారీ స్థాయిలో జరిగింది. మరోసారి అక్కడే బిజేపి భారీ సభకు ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. అప్పుడే భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక వారికి ధీటుగా బిఆర్‌ఎస్ సైతం భారీ సభకు ప్లాన్ చేస్తుంది. ఎలాగో గ్రేటర్ పరిధిలో బిజేపి బలం పెరుగుతూ వస్తుంది. అందుకే బిజేపికి చెక్ పెట్టడానికి..బిజేపిని మించేలా పరేడ్ గ్రౌండ్స్ లో బిఆర్‌ఎస్ సభకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 17వ తేదీన భారీగా జనాలని తరలించి సభ నిర్వహించాలని చూస్తున్నారు. మొత్తానికి బిజేపికి చెక్ పెట్టేలా బిఆర్‌ఎస్ ప్లాన్ ఉంటుంది.