‘బటన్’ నొక్కడం తేడా కొట్టేస్తుందా?

-

ఎప్పుడైతే తన పని బటన్ నొక్కడం అని సీఎం జగన్ అన్నారో అప్పటినుంచి ఏపీ రాజకీయాల్లో బటన్ నొక్కడం అనే మాటని ప్రతిపక్షాలు పెద్ద కామెడీ చేస్తూ వచ్చేస్తున్నాయి. అంటే సీఎం జగన్ ఉన్నది బటన్ నొక్కడానికేనా…ఇంకా ఏ పనిచేయరా? ఒక బుడ్డోడుకు చెప్పిన బటన్ నొక్కుతాడు కదా అని ఎగతాళి చేస్తున్నారు. అయితే సీఎం జగన్ మంచి ఉద్దేశంతోనే చెప్పారు…అంటే బటన్ నొక్కి ప్రజలకు నేరుగా డబ్బులు అందిస్తున్నానని..కానీ దానిపై ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.

వాస్తవానికి కొన్ని వర్గాల ప్రజలు ఈ అంశంపైన కాస్త సెటైర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బటన్ ఒక్కటి నొక్కితే సరిపోదు అనేది కొందరు భావిస్తున్నారు. పథకాల ద్వారా లబ్ది పొందేవారు పెద్దగా దీనిపై స్పందించడం లేదు…పథకాల లబ్దిదారులు కానివారు…ఇతర వర్గాలకు చెందినవారు బటన్ నొక్కుడుపై సెటైర్లు పేలుస్తున్నారు. వాస్తవానికి చూసుకుంటే…బటన్ నొక్కి ప్రజల ఖాతాలో డబ్బులు ఒకటే వేస్తే సరిపోదు అని చెప్పాలి.

అభివృద్ధి చేయాలి…ఆదాయం సృష్టించాలి..ఇంకా పెట్టుబడులు తేవాలి…ఉద్యోగ కల్పన చేయాలి..రోడ్లు వేయాలి..ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఏదొకవిధంగా అప్పులు తెచ్చో…లేక ప్రజలపై పన్నుల భారం పెంచో..పథకాలకు డబ్బులు ఇస్తే లాభం జరిగేలా లేదు. అయితే అభివృద్ధి కూడా జరుగుతుందని వైసీపీ నేతలు అంటున్నారు…కానీ ఆ అభివృద్ధి ఏంటి అనేది పూర్తిగా చెప్పలేని పరిస్తితి.

ఎప్పుడైతే మనిషి కొనుగోలు శక్తి తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆర్ధిక సంక్షోభం పెరుగుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. పథకాలకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రజలు బాగుపడిపోతారు అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఈ విషయంలో జగన్ కాస్త వర్షన్ మార్చాలని కోరుతున్నారు. ఎప్పుడు బటన్ నోక్కే కార్యక్రమంలో ఉండటం, అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్, రాధాకృష్ణా, రామోజీ రావు, బీవీఆర్ నాయుడులని తిట్టినంత మాత్రాన ఉపయోగం ఉండదని అంటున్నారు.

ఎందుకంటే ప్రభుత్వంలోని తప్పులని వారి ఎత్తిచూపుతున్నారు…కాకపోతే వారు రాజకీయం కూడా చేస్తున్నారు. అలా అని వారిని తిడితే…జనం కూడా తిట్టుకుంటారని అనుకుంటే పొరపాటే. కాబట్టి బటన్ నొక్కడం అనేది ఎక్కడో తేడా కొట్టేసేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news