జగన్ బిగ్ షాక్; రాజధాని మార్చొద్దని కేంద్రం లేఖ…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్చే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. వచ్చే ఏడాది మార్చ్ 31 వరకు రాజధాని మార్చవద్దని స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా రాష్ట్ర రెవెన్యూ శాఖకు కేంద్ర హోం శాఖ పరిధిలోని జనాభా లెక్కల డైరెక్టరేట్‌ ఒక లేఖ రాసింది. రాష్ట్రంలోని సరిహద్దులు మార్చవద్దని, త్వరలో 2021 జనాభా లెక్కల గణన జరగనుందని, అది పూర్తయ్యే వరకు పరిపాలనా విభాగాల(అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్స్‌) సరిహద్దులను మార్చరాదని స్పష్టం చేసింది.

సచివాలయం మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్న తరుణంలో… జిల్లా, రెవెన్యూ డివిజన్‌, మండలం, గ్రామాలు పరిపాలనా విభాగాల కిందకే వస్తాయని, జనాభా లెక్కలు పూర్తయ్యేవరకు చేపట్టవద్దని ఆదేశాలు జారి చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఒకసారి చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటుకి అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలో జిల్లాల ఏర్పాటుకి కూడా అడ్డుపడింది కేంద్రం.

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం గాని రెవెన్యూ డివిజన్‌, మండలాలు, గ్రామాల వారీగా విభజన చేపట్టకూడదని స్పష్టం చేసింది. జనాభాలెక్కలు ముగిసేవరకు ఇప్పుడున్న యథాతథ స్థితినే కొనసాగించాలిని తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఫిబ్రవరి 9 నుంచి జనాభా లెక్కల కార్యక్రమం ప్రారంభం మొదలై… వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు రివిజన్‌ జరగనుంది.

ఏప్రిల్‌, సెప్టెంబరు మాసాల్లో ఇంటింటి గణన, ఇళ్ల లెక్కల గణన, జనాభా రిజిస్టర్‌ అప్‌డేట్ చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పాలనా యూనిట్ల విషయంలో యథాతథ స్థితినే కొనసాగించాలని తన ఆదేశాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు ఇది ఇబ్బందికరంగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖ ఇప్పటికే జగన్ వద్దకు చేరిందని ఆయన తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news