టీడీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇటీవల ప్రధాని మోడీ తో ఫోన్ లో మాట్లాడినట్టు స్పష్టం చేశారు. కరోనా వైరస్ విపత్తు కారణంగా కొన్ని సూచనలు ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. దాదాపు 14 నెలల తర్వాత ఇద్దరి మధ్య సంభాషణ జరగటంతో ఏపీలో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది. గత సార్వత్రిక ఎన్నికల టైంలో మోడీని చాలా దారుణంగా విమర్శించి దేశవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏకంగా ఢిల్లీలోనే మోడీకి వ్యతిరేకంగా దీక్ష చేసి కాంగ్రెస్ పార్టీ అప్పటి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో చేతులు కలిపి ఎన్నికల్లో పాల్గొని మోడీని తీవ్రస్థాయిలో విమర్శించడం జరిగింది.ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో మోడీ గెలవడం, ఇటు వైపు టిడిపి ఓడిపోవడం అందరికీ తెలిసినదే. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు బీజేపీతో దోస్తీ కట్ చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానని అనుకోవటం జరిగింది. ఇదే టైమ్ లో మోడీతో భేటీ అవ్వాలని చాలాసార్లు ప్రయత్నాలు చేసిన మొన్నటివరకు వర్కౌట్ కాలేదు. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మోడీ కి ఫోన్ చేసి సూచనలు ఇవ్వడం జరిగినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు.
అసలు మోడీ, చంద్రబాబునీ నమ్మే స్థితిలో లేరని, మోడీ దగ్గర తన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారని అంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వైసీపీ పార్టీ నేతలు గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. నీకు రాష్ట్రంలో, ఢిల్లీలో సీన్ అయిపోయింది. పాలిటిక్స్ కి ప్యాకప్ చెప్పాల్సిందే అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఏపీ ప్రజలు చంద్రబాబు పై చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇటువంటి విపత్కర సమయంలో దేశానికి ఉపయోగపడేలా తన ఆలోచనలు మోడీతో చెప్పకుంటే తప్పేంటని ప్రశ్నించారు.
ఇక్కడ ముఖ్యమంత్రి ఎలాగో తీసుకోడు. ఇలాంటి సమయం లో తన నిర్ణయాలు దేశ ప్రధాని గుర్తిస్తే…కొద్ది ప్రాణాలైనా కాపాడినట్లు అవుతుంది కదా అని..చంద్రబాబు పై వస్తున్న ట్రాల్స్ పై మండిపడుతున్నారు. ఇలాంటి విపత్కరమైన సమయంలో ఫోన్ కాల్ నిజమో, అబద్ధమో అసలు మ్యాటర్ కాదు. అదే టైములో ట్రాల్స్ కూడా అనవసరం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే బదులు..కరోనా వైరస్ ని కట్టడి చేయటానికి దృష్టిపెట్టండి అని విమర్శకులకు గట్టిగా క్లాస్ పీకుతున్నారు.