కే‌సి‌ఆర్ ముందు అట్టర్ ప్లాప్ అయిపోయిన చంద్రబాబు !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ అనేకసార్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ నేతల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైనదిగా గుర్తించాలి అని ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది.

ఆ తర్వాత ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఉపఎన్నికల ద్వారా కేసీఆర్ తెలంగాణ ప్రజలలో ప్రత్యేకమైన తెలంగాణ నినాదం ఉందని రుజువు చేయడం జరిగింది.

 

అయితే తాజాగా టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం అమరావతి ప్రాంతంలో నిరసనలు దీక్షలు చేస్తూ వైయస్ జగన్ మళ్లీ ఎన్నికలకు రావాలని రాజీనామా చేయాలని సవాలు విసురుతున్న తరుణంలో కెసిఆర్ మాదిరిగా తన పార్టీ ఎమ్మెల్యేల చేత చంద్రబాబు రాజీనామా చేసే అవకాశం ఉన్నా గాని ప్రస్తుత సందర్భంలో పరిణామాలలో ఎన్నికలకు వెళితే ఓడిపోయే అవకాశం ఉందని చంద్రబాబు ఉప ఎన్నికలకు భయపడుతున్నారని కెసిఆర్ మాదిరిగా రాజకీయం చేయడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అవుతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.